‘నేతాని’ని నేతకానిగా మారుస్తూ త్వరలోనే ఉత్తర్వులు : వివేక్ వెంకటస్వామి

  • దీనిపై రాజకీయాలొద్దు: వివేక్ వెంకటస్వామి 

హైదరాబాద్, వెలుగు: మాల ఉప కులం ‘నేతాని’ని నేతకానిగా మారుస్తూ ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇలాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘నేతకాని సోదరుల విజ్ఞప్తి మేరకు మాల సబ్​క్యాస్ట్​‘నేతాని’ని నేతకానిగా మార్చాలని ఈ నెల 4న సీఎం రేవంత్​రెడ్డికి వినతిపత్రం అందజేశాను. 

నా విజ్ఞప్తిపై ఆయన వెంటనే స్పందించి.. తక్షణమే మార్పులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నేతకానిగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వస్తాయి” అని ప్రకటనలో వివేక్ పేర్కొన్నారు.