చెన్నూరు ఎమ్మెల్యేను కలిసిన జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు

పాల్వంచ, వెలుగు : చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని పాల్వంచకు చెందిన జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆదివారం కలిశారు. వివేక్ ​నివాసంలో ఆయనకు సంఘం అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కరరావు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

శాలువాతో సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం ముఖ్య సలహాదారుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు డాక్టర్ జనార్దన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు యూత్ అధ్యక్షుడు బద్దం రాహుల్, అనంతయ్య, బక్కన్న, విజయరావు, రాములు పాల్గొన్నారు.