ఆకట్టుకుంటోన్న ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. చంపిందెవరు?

టైటిల్ : ది బకింగ్‌హామ్ మర్డర్స్

ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్

డైరెక్షన్ : హన్సల్ మెహతా

కాస్ట్ : కరీనా కపూర్ ఖాన్, యాష్ టాండన్, రణవీర్ బ్రార్, ప్రభలీన్ సంధు

లాంగ్వేజ్: హిందీ

డిటెక్టివ్‌గా కరీనా కపూర్‌ నటించిన చిత్రం 'ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌'. ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్‌'లో స్ట్రీమింగ్‌ అవుతోంది. జస్మీత్‌ (కరీనా కపూర్‌) బ్రిటిష్‌– ఇండియన్‌ డిటెక్టివ్‌. తన చిన్న కొడుకు ఏకమ్ (మైరాజ్ కక్కర్)ని కోల్పోయిన బాధలో ఉంటుంది. అప్పుడే బకింగ్‌హామ్‌షైర్‌ (ఇంగ్లండ్‌)కు చెందిన పదేళ్ల ఇష్​ప్రిత్​ తప్పిపోతాడు. ఆ కేసు జస్మీత్​ దగ్గరికి వస్తుంది. మొదట తను ఆ కేసులో ఇన్వాల్వ్​ అయ్యేందుకు ఇష్టపడదు. కానీ.. ఇష్​ప్రీత్​ కూడా తన కొడుకు ఏకమ్​ వయసువాడే కావడంతో కేసుని టేకప్​ చేస్తుంది. 

ఆమె రంగంలోకి దిగిన కొన్ని గంటల్లోనే.. ఇష్​ప్రిత్​ శవం దొరుకుతుంది. దాంతో ఆ హత్య చేసిన వాళ్లను కనిపెట్టే పనిలో పడుతుంది జస్మీత్‌. ఇష్‌ప్రీత్‌ తల్లిదండ్రులు దల్జీత్‌ కోహ్లి (రణ్‌వీర్‌ బ్రార్‌), ప్రీతి కోహ్లి (ప్రభలీన్‌ కౌర్‌)ల నేపథ్యం ఏంటి? ఆ సిటీలో మత విద్వేషాలకు కారణం ఏంటి? కేసులో జస్మీత్​కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.