భూమి మీదకు వచ్చిన బోయింగ్ స్టార్‌లైనర్.. ఆస్ట్రోనాట్స్ లేకుండానే

అమెరికన్ ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ వారు లేకుండానే భూమి మీదకు చేరుకుంది. శనివారం (ఇండియన్ టైం ప్రకారం) ఉదయం 9 గంటలకు బోయింగ్ క్యాప్యూల్ పారాచూట్ లతో భూమి మీద ల్యాండ్ అయ్యింది. ఇది ఆరు గంటల ముందు స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. ఎయిర్ బ్యాగ్స్ తో సేఫ్ గా స్టార్ లైనర్ కంపెనీకి చెందిన బోయింగ్ న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్‌లో కిందకి దింపారు శాస్త్రవేత్తలు.

2025 వరకు సునితా విలియమ్స్, బారీ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోనే  ఉండాల్సి ఉంది. జూన్ లో స్పేస్ సెంటర్ కు వెళ్లిన సూనితా విలీయమ్స్, బారీ ఇ విల్మోర్ బోయింగ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కిందకి రాలేకపోయారు. పలు మార్లు వారి రిటర్న్ జర్నీ ప్లాన్ చేసినా.. ఆస్ట్రోనాట్స్ భూగ్రహం మీదకు రాలేకపోయారు. 

2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్‌ ఈ రోదసీ యాత్ర చేపట్టారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. అప్పటి నుంచి పలు మార్లు వీరి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి సెప్టెంబర్ 7న సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చింది.