బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకోం : భోగ శ్రావణి

  • రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి 

జగిత్యాల రూరల్ వెలుగు: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ పార్టీ ఆఫీసు పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి తీవ్రంగా ఖండించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాదని ప్రజల నడ్డి విరిచే సర్కారు అంటూ విమర్శించారు. కాషాయ సైనికులు తలుచుకుంటే కాంగ్రెస్ ఎక్కడుంటుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. 

రైతుల చేతులకు సంకెళ్లు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులపై  దాడులు పెరిగాయన్నారు. దాడులు చేస్తే బీజేపీ ఊరుకోదన్నారు. ప్రజల పక్షాన త్వరలోనే భరోసా యాత్రలు చేపడతామన్నారు. డిచ్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని ఉద్దేశిస్తూ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కు రిజైన్  చేయలేదు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదన్న ఎమ్మెల్యే ఆ పార్టీ సమావేశానికి ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు.

అధికార పార్టీకి చెందిన ఇద్దరి నాయకుల మధ్య ఉన్న విభేదాల కారణంగా జగిత్యాలలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముదరాజు, రాజన్న, లీడర్లు మమత, గంగరాజం, పవన్ సింగ్, పద్మ,  తదితరులుపాల్గొన్నారు.