కృష్ణుడికి అటుకులు ఎంతో ఇష్టం.. కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదాలు ఇవే..

 శ్రీ కృష్ణాష్టామిని దేశవ్యాప్తంగా  ( August 26) భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చిన్ని కృష్ణున్ని తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ  కృష్ణ పాదాలు వేస్తారు. బాలకృష్ణుడు తమ ఇంట అడుగుపెడితే సకలశుభాలు కలుగుతాయని భావిస్తారు.  యువకులు ఉట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, యువతులు దాన్ని వారికి అందకుండా పైకి లాగుతారు. ఉట్టి కొట్టిన తర్వాత ప్రసాదాలు పంచుతారు. ఆ ప్రసాదాలలో తప్పనిసరిగా అటుకులతో చేసి వెరైటీలే కనబడుతాయి.  కృష్ణుడి పుట్టినరోజున..చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకులతో చేసే ప్రసాదాల గురించి తెలుసుకుందాం. .  

 అటుకులతో స్వీట్ డంప్లింగ్స్ తయారీకి  కావాల్సినవి

  • అటుకులు ... ఒక కప్పు
  • బెల్లం ...అర కప్పు
  •  మంచి నీళ్లు ...ఒకటిన్నర కప్పులు
  •  ఆకుపచ్చ యాలక్కాయల పొడి.....అర- టీస్పూన్
  • పచ్చి కొబ్బరి తురుము ....పావు కప్పు

తయారీ విధానం: బెల్లంను నానబెట్టి అది కరిగాక వడకట్టాలి. అటుకులను మిక్సీ జార్లో వేసి ఫల్స్ బటన్ ప్రెస్ చేసి బరకగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. మందపాటి అడుగు ఉన్న పాన్​ లో బెల్లం రసం వేసి వేడి చేయాలి. ఉడుకు పట్టాక కొబ్బరి తురుము, యాలుకుల పొడి వేసి కలపాలి. తరువాత పొడి పట్టిన అటుకుల్ని వేసి కలపాలి. చిక్కగా అయ్యేవరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. నీళ్లు అవిరి అయిపోయి బెల్లం, అటుకుల పొడితో బాగా కలిసిపోతుంది. చల్లారే వరకు పక్కన పెట్టాలి. తరువాత చేతులకు కొంచెం నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని కోస్ ఆకారంలో వత్తాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్లలో కోలా చేసుకున్న దంప్లింగ్స్ ను పెట్టి పది నిమిషాలు ఆవిరికి ఉడికించాలి. ఉడికిన పది నిమిషాల తరువాత బయటికి తీయాలి...

అటుకుల కట్​లెట్​ తయారీకి కావలసినవి

  • అటుకులు (మందమైనవి).... రెండు కప్పులు (కడిగి, వడకట్టినవి) 
  • పెసరపప్పు.... పావు కప్పు (కడిగి, వడకట్టాలి) 
  • పచ్చిమిర్చి తురుము...  ఒక టేబుల్ స్పూన్ ((సన్నగా తరిగాలి)
  •  పాలకూర....పావు కప్పు  (సన్నగా తరిగాలి) 
  • కొత్తిమీర...  ఒక టేబుల్ స్పూన్  (సన్నగా తరిగాలి)
  •  చక్కెర ..రెండు టీస్పూన్లు 
  • నిమ్మరసం ...రెండు టీస్పూన్లు
  • ఉప్పు ...రుచికి సరిపడా 
  • నూనె.... మూడు టీస్పూన్లు

 తయారీ విధానం: అటుకుల్ని జల్లెడలో వేసి ట్యాప్ వాటర్ కింద పెట్టి కొన్ని సెకన్లు ఉంచాలి. రెండు నిమిషాలు పక్కన పెడితే నీళ్లు వడకడతాయి. పెసరపప్పుని సరిపడా నీళ్లలో వేసి ఒక గంట నానబెట్టాలి. తరువాత నీళ్లు వడకట్టి అటుకులు, పచ్చిమిర్చి వేయాలి. వీటిని మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. నీళ్లను  కలపవద్దు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి తరిగిన పాలకూర, కొత్తిమీర, చక్కెర, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని పది ఉండలు చేయాలి. వాటిని కట్​ లెట్​ ఆకారంలో చేతితో పెట్టుకొని వత్తాలి. నాన్ స్టిక్ తవాసుతీసుకుని ఒక టీస్పూన్ నూనె తవ అంతటా రాయాలి.ఐదు కట్ లెట్లను తవా మీద పెట్టి ఒక టీస్పూన్ అయిల్చిలకరించి గోధుమ రంగు వచ్చేవరకు రెండు వైపులాకాల్చాలి. మిగతా వాటికి కూడా అలానే కాల్చి  టొమాటో. కెవన్ లేదా గ్రీన్ చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి.

అటుకుల లడ్డు తయారీకి కావాల్సినవి 

  • అటుకులు (మీడియం) ...ఒకటిన్నర కప్పులు
  • ఎండుకొబ్బరి తురుము ...అర కప్పు 
  • చక్కెర  ...పావు కప్పు
  • నెయ్యి....రెండు టేబుల్ స్పూన్లు 
  • మరిగించిన పాలు.... మూడు టేబుల్ స్పూన్లు 
  • జీడిపప్పులు ...ఐదు
  • కిస్ మిస్...  ఒక టేబుల్ స్పూన్
  •  యాలకల పొడి-.... చిటికెడు

తయారీ విధానం:   పాన్​లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్​మిస్​లు వేసి వేగించాలి. కిస్ మిస్ ఉబ్చాక తీసిపక్కన పెట్టాలి. అదే పాన్లో అటుకులు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు మీడియం ఫ్లేమ్ మీద వేగించాలి. ఇందులో కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేగించాలి. వేగించిన పదార్థాలు చల్లారే వరకు ఆగాలి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చక్కెరను మెత్తగా గ్రైండ్ చేసి అటుకులు, కొబ్బరి మిశ్రమంలో కలపాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసి వేగించిన కెస్ మిస్. జీడిపప్పుల్ని యాలకుల పొడి వేసి కలపాలి . పైనుంచి పాలను చిలకరించి, వెంటనే కలపాలి. చిన్న భాగాలుగా చేసి లడ్డూల్లా తయారు చేసుకోవాలి.

అటుకుల స్వీట్ తయారీకి కావాల్సినవి

  • అటుకులు...ఒక కప్పు 
  • బెల్లం .... పావు కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము...  ఆరు టేబుల్ స్పూన్లు
  • కొబ్బరి పాలు..... మూడు టీస్పూన్స్
  • యాలక్కాయ... ఒకటి

తయారీ విధానం: ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుమును గార్నిష్ చేయడం కోసం పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో అటుకులు, కొబ్బరి తురుము, యాలకుల గింజలు బెల్లం వేసి బాగా అంటే అటుకులు బెల్లం బాగా కలిసే వరకు కలపాలి. దీని పైన కొబ్బరి పాలు చిలకరించి కలపాలి. కొబ్బరి పాలు అటుకుల్ని మెత్తగా చేస్తాయి. వెంటనే తినొచ్చు లేదా ఫ్రీజ్లో పెట్టి మరుసటి రోజు కూడా తినొచ్చు. ఆ దీన్ని ముందు రోజు రాత్రి చేసి పెట్టకుంటే మరుసటి రోజుకు లేకుండా బ్రేక్ ఫాస్ట్ రెడీగా ఉంటుంది. ఒకవేళ కొబ్బరి తినడం ఇష్టం లేదనుకుంటే బాదం లేదా. మీకు నచ్చిన నట్స్ వాడొచ్చు.

పెరుగుతో అటుకుల రెసిపి తయారీకి కావలసినవి

  • అటుకులు ..ఒక కప్పు 
  • పెరుగు.... పావుకప్పు
  • కీరదోసకాయ...ఒకటి  (చెక్కు తీసి, ముక్కలు తరిగినది) 
  • పచ్చి కొబ్బరి తురుము ....మూడు టేబుల్ స్పూన్స్ 
  • అల్లం తరుగు...కొంచెం
  •  ఉప్పు ....రుచికి సరిపడా
  • కొత్తిమీర కట్ట...  ఒకటి (తరిగి)
  • తాలింపునకు .... నెయ్యి ఒక.. టీస్పూన్
  •  ఆవాలు, జీలకర్ర  ....ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
  •  పచ్చిమిర్చి.... రెండు(నిలువుగా కోసినవి)

తయారీ విధానం : అటుకుల్ని రెండు నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి. కాస్తం మందంగా ఉన్న అటుకులు అయితే ఐదు నిమిషాలు నానబెడితే మెత్తబడతాయి అటుకులు మెత్తబడ్డాక నీళ్లు వంపేసి జల్లీలో అటుకుల్ని వేస్తే నీళ్లు పోతాయి. ఓ మాదిరి మంట మీద నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి ఒక నిమిషము వేగించి స్టవ్​ ఆపేయాలి.  ఈ తాలింపును నానబెట్టిన అటుకుల్లో వేసి పెరుగు, కీర దోసకాయ తరుగు, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలపాలి. ఉప్పు రుచి చూసి సరపడకపోతే కొంచెం కలుపుకోవాలి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే రెడీ.

అటుకుల్లో ఉండే పోషకాలు: అటుకుల్లో విలిమిన్ ఎ, బి6, సీ,డీ,ఈ, కే విటమిన్లు ఉంటాయి. కార్భొహైడ్రేడ్​, ఐరన్​లతో పాటు ఫైబర్ ఎక్కువమోతాదులో ఉంటుంది.  సోడియం, పొటాషియం. మెగ్నీషియం, సిలీనియం, పాస్పరస్​లు కూడా ఉంటాయి. ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

రోజూ పిడికెడు అటుకులు తింటే ప్రయోజనాలు

  •  వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.
  •  శరీ అక్సిజెన్ సాఫీగా సరఫరా అయ్యేలా సహకరిస్తాయి.
  •  షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. తిన్న తరువాత గ్లూకోజ్ ని చాలానెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి.
  • రక్తహీనత సమస్యని తగ్గిస్తాయి. 
  • పిల్లలకి గర్భిణీలకు, బాలింతలకు బలవర్థకమైన ఆహారం.
  •  బరువు తగ్గాలనుకునేవారు, షుగర్​ పేషెంట్స్ రోజా తింటే మంచిది.
  •  పెరుగులో అటుకులు కలిపి దద్దోజనం లాగా  తీసుకోవడం వల్ల కాల్షియం బాగా శరీరానికి అందుతుంది.
  •  కీళ్ల నొప్పులు ఉన్నవారికి అమృతం. . .