చలికాలం గజగజ మొదలైందంటే చాలు.. చర్మంపై మొదటి ప్రభావం కనిపిస్తుంది. చర్మం పొడిబారడం, పెదాలు పగలడం వంటివి ఎంతో ఇబ్బంది పెడతాయి. ఇలాంటి వాటిని ఈజీగా నయం చేసుకోవచ్చు. కొన్ని హోం రెమెడీస్ వాడితే చలికాలంలో వీటి బాధను తప్పించుకోవచ్చు.
• చలికాలంలో ఎక్కువ మంది వేడినీటి స్నానం చేస్తారు. అయితే రెగ్యులర్ గా వేడినీళ్లు చేయడం. కన్నా చన్నీళ్ల స్నానం చేయడమే చర్మానికి మేలు. అయితే స్నానం చేసే నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తే చర్మం పొడిబారకుండా
ఉంటుంది.
• బీట్ రూట్ ను పేస్టలా తయారు చేయాలి. అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో అర టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ అంతటా సున్నితంగా అప్లయ్ చేయాలి. అది ఎండిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం పొడిబారదు.
• కొన్ని పుదీనా ఆకులను రోజ్ వాటర్ గ్రైండ్ చేయాలి. దాంట్లో పసుపు వేసి ముఖం, అంతటా రాయాలి. దీని ద్వారా స్కిన్ చేంజెసన్ను గమ నించవచ్చు. 21 రోజులు క్రమం తప్పకుండా ఇలా చేయాలి. చర్మం తాజాగా ఉండటానికి ఈ పేస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది.
• మొక్కజొన్న పిండి, పెరుగు కలిపి స్నానానికి ముందు చర్మంపై రాసి, ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు, చలికాలంలో దెబ్బతినకుండా ఉంటుంది.
• సంత్రా పండ్ల తొక్కలను బాగా దంచాలి. అది పేస్టులా అయ్యాక ముఖానికి, చేతులకు, కాళ్లకు రాసి కొద్దిసేపు ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది.
• టమాట గుజ్జులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిగా మారడం తగ్గుతుంది. చర్మంపై గాయాలు, వాటిమచ్చలుకూడా తగ్గిపోతాయి.
• సాధారణంగానే చాలామంది స్కిన్ ను కాపాడుకోవడానికి లోషన్స్, టోనర్స్, బాడీ క్రీమ్స్ వాడతారు. వీటిల్లో ఎక్కువ ఆల్కహాలు ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిగా మారుతుంది. కాబట్టి వీటిని కొనేటప్పుడే ఆల్కహాల్ తక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ ని తీసుకోవాలి.
• స్నానం చేసిన తర్వాత శరీరాన్ని కొబ్బరి నూనెతో మర్ధన చేస్తే కూడా చర్మం పొడిబారదు.