Good Health: ఇది సంజీవిని అంట.. వారానికోసారి తింటే చాలు..

కంప్యూటర్​ యుగం.. హైటెక్ యుగంలో జనాలు ఆరోగ్యపరంగా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సమయానికి తిండి.. టైం ప్రకారం నిద్రపోవకపోవడం.. వేళాపాళా లేని ఉద్యోగాలు..ఒకటేమిటి.. బయట ఏది పడితే అది తిని ఆకలి చల్లార్చుకోవడం ఇది యువత లైఫ్​ స్టైల్​.. దీంతో వ్యాధినిరోధక శక్తి తగ్గి జనాలు తరచూ అనారోగ్యానికి గురికావడం.. 20 ఏళ్లకే 60 ఏళ్ల మాదిరిగా బాధపడటం ఇలా ఒకటేమిటి.. అన్నీరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.  అయితే వారానికొకసారి అరటిపువ్వును తింటే .. ఇది సంజీవిని మాదిరిగా పనిచేస్తుందని  వైద్య నిపుణులు చెబుతున్నారు.  అసలు అరటిపువ్వు తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.  .         

అరటిపండ్లు.. ఇవి మార్కెట్​ లో తక్కువ ధరకు లభించే ఫ్రూట్స్​...ఇవి దాదాపు అందరికి తెలుసు.  కాని అరటి పువ్వులను సాధారణంగా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ అలాంటి సమస్యలకు అరటి పువ్వు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పువ్వును తరచూగా మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తుంది.

అరటి పండు అందరికీ అందుబాటులో ఉండే, చవకైనది. అరటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం అరటి పండ్లలో మెండుగా లభిస్తాయి. తియ్యదనంతో, పసుపు, ఎరుపు రంగులో ఉండే అరటిపండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఆకుపచ్చ అరటి కాయలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఆకుపచ్చ అరటి కాయలను కూరగాయ రూపంలో ఎక్కువగా వినియోగిస్తారు. 

అరటి పువ్వులలో పొటాషియం, కాల్షియం, రాగి, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా ఉన్నాయి. అంతేకాదు.. అరటి పువ్వుతో కిడ్నీ సమస్యలు నయం చేసుకోవచ్చు. అరటి పువ్వులో ఉండే విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తుంది. అరటి పువ్వులో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పువ్వును తరచూగా మీ ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి.

అదనంగా,  అరటి పువ్వులోని ఫైబర్ బరువు తగ్గడానికి, స్థూలకాయాన్ని తగ్గించడానికి అద్భుతమైన ఎంపిక. దీంతో కొవ్వు కూడా తగ్గుతుందని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. అరటి పువ్వులలో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి. ఒత్తిడి, మానసిక స్థితిని మంచి స్థితిలో ఉంచడానికి ఇది చాలా మంచిది. అరటి పువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దీంతో శరీరంలోని రక్తహీనత కూడా తొలగిపోతుంది. డయాబెటీస్‌ బాధితులు అరటి పువ్వుతో చేసిన కూరను తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్‌లోకి వస్తాయి. అరటి పువ్వులో ఉండే ఫినోలిక్‌, ఆమ్లాలు, టానిన్లు, ఫేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌, గుండె జబ్బులు వంటివి రాకుండా అడ్డుకుంటాయి.

ఇక అరటి ఆకులను కూడా భోజనం చేసేందుకు వినియోగిస్తారు. అలాగే, ఇటీవలి కాలంలో అరటి ఆకులతో స్నానం చేయించే ఆయుర్వేద వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే, అరటి పువ్వులను సాధారణంగా తక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ అలాంటి సమస్యలకు అరటి పువ్వు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.