రామా.. బాల రామా.. ఏమా ముఖ వర్చస్సు

అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడు.. బాల రాముడి ముఖారవిందం ఎలా ఉంటుంది.. ఈ ప్రశ్నలకు ఈ ఫొటోనే సాక్ష్యం.. అయోధ్య గర్భ గుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతున్న ఆ రాముడి విగ్రహాన్ని కళ్లారా చూడండి.. నిజ రూప దర్శనం ఇదే.. బాల రాముడి ముఖారవిందం అయితే అద్భుతం.. తేజోమయం అంటున్నారు భక్తులు..

బాల రాముడి ముఖారవిందాన్ని కళ్లారా చూస్తూ..  తన్మయత్వంతో మైమరిచిపోతున్నారు భక్తులు. నిండైనా ముఖం.. అమాయకంగా.. చిరు నవ్వులతో.. చిద్విల్లాసంగా.. ఎంతో ప్రశాంతంగా ఉంది రాముడి ముఖం.. నడక వచ్చిన బాల రాముడు ఎలా అయితే ఉంటాడు.. ఎంత ముద్దుగా ఉంటాడో.. ఈ చిత్రం కళ్లకు కడుతుంది.. పెద్ద కళ్లు.. కోల ముక్కు.. చిన్నగా ఉన్న నోరు.. నవ్వుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చే బుగ్గలు.. నిజంగా బాల రాముడిని స్వయంగా చూడాలనే ఆతృత భక్తుల్లో పెంచుతుంది రాముడి రూపం..

అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రతిష్టించిన బలరాముడి విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ రామయ్య దివ్యరూపాన్ని చూసిన భక్తులు భక్తిపారవశంతో పులకించిపోతున్నారు.అయోధ్యలో రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపద, చూడగానే ఆకట్టుకునే హంగులతో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది. అంతేకాదు ఆలయాన్ని ప్రారంభించేందుకు ఖరారుచేసిన ముహుర్తానికి సమయం దగ్గరపడుతున్నాయి. దీంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్య ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు అందుకోనున్న బాలరాముడి విగ్రహం గర్భగుడిలోకి చేరుకుంది. ఆ భవ్యరాముడికి చెందిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.


శ్యామల్’ (black) రాతితో చేసిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) రూపొందించారు. యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న ఐదేళ్ల పిల్లవాడిగా చిత్రీకరించారు. కమలం, హాలో కారణంగా, విగ్రహం 150 కిలోగ్రాముల బరువు ఉంటుందని, భూమి నుండి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు ఏడు అడుగులు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. అయోధ్య రాముడి ముఖం బయటకు కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచారు. గర్భగుడిలో కొలువైన ఈ విగ్రహానికి జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇక జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత రాములవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.