ప్రభుత్వ హాస్టల్స్ లో మెస్ చార్జీలు పెంచాలి : ఏఐఎస్​ఎఫ్​ ప్రతినిధులు

కామారెడ్డిటౌన్, వెలుగు: ప్రభుత్వ హాస్టల్స్ లో  మెస్​చార్జీలు పెంచాలని ఏఐఎస్​ఎఫ్​ ప్రతినిధులు డిమాండ్​ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ హాస్టల్స్​ను పరిశీలించారు.   స్డూడెంట్స్​తో మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్​చార్జీలు పెంచాలన్నారు.

కాస్మోటిక్స్​ చార్జీలు ప్రతి నెల రూ.200 ఇవ్వాలన్నారు. హాస్టల్స్​లో ట్యూటర్స్​ను నియమించాలని డిమాండ్​ చేశారు. ప్రతినిధులు పి. శివ ప్రసాద్, రణధీర్, సంపత్  పాల్గొన్నారు.