రెండు యోగ దినాలు, ఆ నక్షత్రంలో.. 300 ఏళ్ల తర్వాత అరుదైన ముహూర్తంలో మహా శివరాత్రి

ఆది గురువు, భోళా శంకరుడు, నీల కంఠుడు.. ఇలా ఒకటేమిటి శివుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా భక్తుల కోరికలు తీరుస్తాడు.  ఏడాది ఒక్కో శివరాత్రి పేరుతో ఆయన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తూనే ఉంటారు. ప్రతి నెల బహుళ చతుర్థశి నాడు మాస శివరాత్రి వస్తుంది. మాఘ బహుళ చతుర్థశి రోజు వచ్చే మహా శివరాత్రి అంటే మరింత ప్రత్యేకం. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది. ఈ ఏడాది వచ్చే శివరాత్రి సర్వార్థ సిద్ది యోగ కాలంలో ఏర్పడిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  300 సంవత్సరాల తరువాత ఇలాంటి అరుదైన కలయిక జరిగిందని పండితులు చెబుతున్నారు.  

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ... 300  సంవత్సరాల తరువాత సర్వార్థ సిద్ది యోగ కాలంలో మహాశివరాత్రి పర్వదినం వచ్చిందని చెబుతున్నారు.  ఆ రోజున (మార్చి 8) శివ యోగంతో సర్వార్థ సిద్ది యోగం వంటి అరుదైన యోగం ఏర్పడబోతోంది. మహాశివరాత్రి శుక్రవారం రావడంతో ఆరోజు ప్రదోష వ్రతం కూడా ఉంది.  పురాణాల ప్రకారం శుక్ర ప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిణమించింది.  ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం, వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం, ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. సుమారు 300 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతుంది.

శివరాత్రి రోజు... అరుదైన కలయికలు

మార్చి 8న కోరికలు తీర్చే సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతుంది. ధ్యానం, మంత్రోచ్చారణకు ఉత్తమమైన శివ యోగం కూడా ఆరోజు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మహా శివరాత్రి రోజు మొత్తం శివయోగం ఉంటుంది. ఉదయం 6.38 గంటల నుంచి 10.41 వరకు సర్వార్త సిద్ధి యోగం ఏర్పడుతుండగా సూర్యోదయం నుంచి 12.46 గంటల వరకు శివయోగం జరుగుతుంది.

సర్వార్థ సిద్ధి యోగం

మాఘ మాసంలో  కృష్ణ పక్షం  చతుర్ధశి నాడు వచ్చే మహా శివరాత్రి సర్వార్థ సిద్ధి యోగంతో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతుంది. ఆరోజు శివారాధనకు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు శివయోగం, శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక జరగబోతోంది. మార్చి 9వ తేదీతో సిద్ది యోగం సమయం ముగుస్తుంది. ఇన్ని అద్భుతమైన యోగాలు కలయిక కావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ప్రతిఫలం దక్కనుంది.

సిద్ధ యోగం

విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు. సిద్ధ యోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించినది. ఈ యోగంలో వినాయకుడిని పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతం అవుతుంది. ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సు అందిస్తుంది.

శివయోగం

శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

శ్రవణ నక్షత్రం

శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశీస్సులు ఉంటాయి. శివుడి భక్తుడు శనీశ్వరుడు. శివ అనుగ్రహంతో పాటు శని చల్లని చూపు మీమీద ఉంటుంది. అందుకే ఈరోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

శుక్ర ప్రదోషం, శివరాత్రి కలిసి...

ఈ సారి మహా శివరాత్రి, శుక్ర ప్రదోష వ్రతం రెండూ ఒకే రోజు వస్తున్నాయి. ఆరోజు శివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి. ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కలిసి వస్తుంది. దివ్యమైన ఆరోజు పూజ చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

ALSO READ :- ప్రియాంక గాంధీ చేవెళ్ల పర్యటన రద్దు