బంగాళాఖాతంలో రెండు తుఫానులు ఏర్పడుతున్నాయా.. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. మరొకటి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండు చిన్న తుఫానులు కలిసి ఒక పెద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. బంగాళా ఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని.. ఒడిశా తీర ప్రాంతంలో గంటకు 45 కిలోమీటర్లు నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వేగంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. వీటిలో ఒక అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రానున్న రెండు రోజులు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 15, 16 రెండు రోజులు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. నవంబర్ 15 న ఒడిశాలోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ 16న ఒడిశాలోని మిగతా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఉన్న అల్పపీడనం నవంబర్ 16 నపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గా మారే ముందు పశ్చిమ వాయువ్య దిశంగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అనంతరం ఇది ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి వక్రంగా మారి నవంబర్ 17న ఒడిశా తీరంలో వాయువ్య బంగాళా ఖాతం చేరుతుందని తెలిపింది.
‘వాతావరణ శాఖ మరొక వాయు తుఫాను ప్రసరణనను గమనించింది. ఇది బంగాళ ఖాతం నైరుతి భాగాలపై ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది’ అని దక్షిణ కొరియాలోని బెజు నేషనల్ యూనివర్సిటీకి చెందిన టైఫూన్ రీసెరచ్ సైంటిస్ట్ వినీత్ కుమార్ సింగ్ తెలిపారు.
రెండు సముద్ర తుఫానులు ఒకే ప్రాంతంలో ఏర్పడినప్పుడు, అవి ఒకదాని పరిధిలో ఒకటి ఒకే దిశలో తిరుగుతున్నప్పుడు వాటికి ఉమ్మడి కేంద్రం ఏర్పడే అవకాశం ఉంది.. అవి వాటి మార్గాల్లో వెళ్లి ఒకదానితో ఒకటి విలీనంఅ వుతాయి.. ఇలాంటి అరుదైన సందర్భాల్లో రెండు చిన్న తుఫానులు కలిసి ఒక పెద్ద తుఫానుగా మారుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే వీటిలో మొదటి అల్పపీడనం చల్లబడిన తర్వాత రెండో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సందర్భంగా ఫుజివార ప్రభావంలో వాటి పరస్పర చర్యకు తక్కువ అవకాశం ఉందని అంటున్నారు.
శాస్త్రవేత్త ప్రకారం.. ఫుజివారా ..రెండు బ్యాక్ టు బ్యాక్ సైక్లోన్లు లేదా తుఫానులు.అంటే 24 గంటల్లో గంటలకు 56 కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ గాలి వేగంతో ఎక్కువ ప్రభావం చూపించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.