రామగుండం బల్దియా మీటింగ్‌‌‌‌‌‌‌‌ రసాభాస

  • మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ప్లకార్డులతో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్ల ఆందోళన 

గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియా మీటింగ్ రసాభాసగా మారింది. కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసనకు దిగారు. బుధవారం రామగుండం కార్పొరేషన్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో 15వ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అధ్యక్షతన జరిగింది. మీటింగ్​ ప్రారంభం కాగానే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్​ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌) నుంచి అమ్మోనియా కలిసిన నీరు విఠల్​నగర్​, తిలక్​నగర్​ కాల్వల నుంచి పారుతూ దుర్వాసన వెదజల్లుతోందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, బొడ్డు రజిత, రాకం శ్రీమతి ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచనలతో తాను, కమిషనర్ కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించామని, రసాయనాలు కాలువలోకి వదలొద్దని ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను హెచ్చరించినట్లు మేయర్ తెలిపారు.

అయినా కార్పొరేటర్లు వినకుండా ఆందోళన చేయడంతో 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైనా సమస్యపై చర్చించి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు పంపాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.  అనంతరం ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో జీరో లిక్విడ్​ డిశ్చార్జ్​ నిర్మాణాన్ని చేపట్టకపోతే ఆర్ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌పై క్రిమినల్​ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నట్టు తీర్మానం చేశారు.

అలాగే 25వ డివిజన్​ కార్పొరేటర్​ నగునూరి సుమలత ప్లకార్డుతో నిరసన తెలిపారు. తన డివిజన్​లో సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ 20వ డివిజన్​ కార్పొరేటర్​ కన్నూరి సతీశ్‌‌‌‌‌‌‌‌కుమార్​ నల్ల కండువా కప్పుకుని మీటింగ్​కు హాజరయ్యారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో 23 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో గోదావరిఖని పట్టణంలో వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్ల వెడల్పు కోసం కౌన్సిల్​ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో తీర్మానం చేశారు.

టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐడీసీ స్కీమ్​ కింద విడుదలైన రూ.100 కోట్లతో పనులు చేపట్టడానికి టెండర్లు పూర్తి కావడంతో తీర్మానం చేశారు. అనంతరం మేయర్​ మాట్లాడుతూ రామగుండం బల్దియాను మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మీటింగ్​లో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌‌‌‌‌‌‌‌రావు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.