ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే.. ఈ పప్పులు తినండి

పప్పుకూర... అనగానే.. చాలామంది పెదవి విరుస్తారు. కొంతమంది.. పప్పు పేరు వినగానే నాలుక చప్పరిస్తుంటారు. పప్పులు తింటే రోగాల తిప్పలుండవు. పప్పుల వల్ల తప్పే రోగాల తిప్పలేంటో.. షార్ట్ అండ్ స్వీట్ గా మీకోసం..

కందిపప్పు : ఇందులో ప్రొటీన్లు కావల్సినన్ని ఉంటాయి. ఇందులో ఉండే ఫోలెట్ రక్తహీనతకు చెక్ పెడుతుంది. ఎముక పుష్టికి సహకరిస్తుంది. 
పెసరపప్పు: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి పెసర్లు ఉపయోగపడుతాయి. జట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా పెసరపప్పు తినండి. రక్తపోటును కూడా తగ్గిస్తాయి.
మినపప్పు : కండరాల నిర్మాణానికి మినపపప్పు చాలా దోహదం చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
బొబ్బెర్లు : ఇందులో పీచు, ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఫాంక్రియాటిక్ క్యాన్సర్ ని నివారించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. 
మసూరి పప్పు : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనూరి పప్పు బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.