అంతుబట్టని జ్వరంతో యూపీలో 32 మంది చిన్నారులు మృతి

అంతుబట్టని జ్వరంతో యూపీలో 32 మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్ లో అంతుబట్టని జ్వరాలతో 39 మంది చనిపోయారు. అందులో 32 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవారున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఫిరోజాబాద్ జిల్లాలో దాదాపు 9 ప్రాంతాల్లో డెంగ్యూ లాంటి అంతుబట్టని వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 

చనిపోయిన వారి కుటుంబాలను సీఎం ఆదిత్యనాథ్ పరామర్శించారు. చిన్న పిల్లల ఆస్పత్రిని పరిశీలించారు. ఫిరోజాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఇలాంటి జ్వరాల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనాకూ ప్రత్యేక వార్డును సిద్ధం చేశామన్నారు. అయితే.. వారంతా డెంగ్యూతో చనిపోయారన్న వార్తలను కొట్టిపారేశారు. ఈ జ్వరాలపై కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.

ఈ జ్వరాలపై అవగాహన లేకపోవడంతో పేషెంట్లను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారని అన్నారు.  ఈ నెల 18న ఫస్ట్ కేసును గుర్తించారన్నారు.