న్యూఢిల్లీ: బిర్యానీ ఆర్డర్స్‌లో జొమాటో దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రతి నిమిషానికి 22 బిర్యానీ ఆర్డర్స్‌ను అందుకున్నట్లు జొమాటో తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది 19.88 లక్షల ప్లేట్ల వెజ్ బిర్యానీలను డెలివరీ చేశామని, నిమిషానికి సుమారు 22 శాకాహార బిర్యానీ ఆర్డర్‌లను అందుకున్నామని జొమాటో తెలిపింది. బెంగళూరుకు చెందిన యశ్ అనే వ్యక్తి ఈ ఏడాదిలో 1,380 ఫుడ్ ఆర్డర్‌లు చేశాడని, దాదాపు రోజుకు నాలుగు ఆర్డర్‌లు పెట్టాడని పేర్కొంది. ఈ ఏడాది అత్యధికంగా గులాబ్ జామున్ ఆర్డర్‌లు అందుకున్నామని, కేవలం దీపావళి సమయంలోనే లక్ష ఆర్డర్‌లు అందుకున్నామని వివరించింది.
2020 meme rewind⏪
(and a lil bit about how India ordered this year) pic.twitter.com/84xXSPB5Hh
— zomato (@zomato) December 30, 2020
