పంజాబ్ పై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండ వేడిమిని తాళలేక ప్రజలే కాదు..మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలో జిరాక్ పూర్ లోని ఛత్బీర్ జూ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. సూర్యుడి భగ..భగల నుంచి ఉపశమనం పొందేందుకు జూలోని జంతువుల కోసం చెరువులు, వాటర్ కూలర్స్, వాటర్ స్ప్రింగ్స్ ,చిన్నపాటి గుడిసెలను ఏర్పాటు చేశారు. బోనుల్లో కూడా క్రమం తప్పకుండా వాటర్ పెడుతున్నారు. జూలో ఏర్పాటు చేసిన చెరువుల్లో జంతువులు సేదతీరుతున్నాయి. వాటర్ లో ఎంజాయ్ చేస్తూ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నాయి.
Zirakpur | Heatwave in city, management of Chhatbir Zoo takes measures to provide relief
— ANI (@ANI) June 12, 2022
We've made water ponds, installed water coolers, water springs & mist foggers, made huts. We're also cooling down cages by watering them regularly: Harpal Singh, Zoo Range Officer pic.twitter.com/8968zEZzdJ
