టీ20లో 344..అత్యధిక స్కోరుతో జింబాబ్వే  వరల్డ్ రికార్డు

  • 290 రన్స్ తేడాతో గాంబియాపై భారీ విజయం

నైరోబి : ఇంటర్నేషనల్ టీ20ల్లో  అత్యధిక స్కోరు సాధిస్తూ జింబాబ్వే క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా గాంబియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 344/4 స్కోరు చేసింది. దాంతో గతేడాది ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగోలియాపై నేపాల్ చేసిన 314/3 రికార్డును బ్రేక్ చేసింది.  జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సికందర్ రజా (43 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 15 సిక్సర్లతో 133 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సెంచరీతో దంచికొట్టాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.

రజా టీ20ల్లో  సెకండ్ ఫాస్టెస్ట్ (33 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సెంచరీ రికార్డును సమం చేశాడు.  ఓపెనర్లు మరుమని (19 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 62), బ్రియాన్ బెనెట్ (26 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 50), క్లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మడండె (17 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 53 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫిఫ్టీలతో మెరిశారు. వీళ్ల దెబ్బకు గాంబియా బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముసా జొబర్తే  (4 ఓవర్లలో93 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) టీ20ల్లో అత్యధిక రన్స్ ఇచ్చిన బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. మరో నలుగురు బౌలర్లు తమ కోటాలో 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు.

జింబాబ్వే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 27 సిక్సర్లు ఉన్నాయి. దాంతో ఒక టీ20 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా కూడా నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (26)  రికార్డును  జింబాబ్వే బ్రేక్ చేసింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన గాంబియా 14.4 ఓవర్లలో 54 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. జట్టులో ఆండ్రె జర్జు (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మాత్రమే డబుల్ డిజిట్ దాటాడు. ఫలితంగా 290 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో గెలిచిన జింబాబ్వే టీ20ల్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది.