పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జింబాబ్వే క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. టీ20ల్లో సికందర్ రజా జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, 50 ఓవర్ల ఫార్మాట్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రెగ్ ఎర్విన్ జట్టును నడిపించనున్నాడు.
జింబాబ్వే వన్డే జట్టులో ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. ఆ ముగ్గురూ.. ట్రెవర్ గ్వాండు, తషింగా ముసెకివా, టినోటెండా మపోసా. వీరిలో గ్వాండు, ముసెకివా ఇప్పటికే టీ20ల్లో అరంగ్రేటం చేశారు. గ్వాండు 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టగా.. ముసెకివా 5 మ్యాచ్‌ల్లో 38 పరుగులు చేశాడు.
జింబాబ్వేలో పాకిస్తాన్ పర్యటన నవంబర్ 24 నుంచి తెరలేవనుంది. మొదట మూడు వన్డేలు జరగనుండగా.. అనంతరం టీ20 సిరీస్ షురూ కానుంది.
జింబాబ్వే వన్డే జట్టు: క్రెగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బెన్నెట్, సికందర్ రజా, సీన్ విలియమ్స్, గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, మపోసా, మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, ముజర్బానీ, మైయర్స్, రిచర్డ్ నగర్వా.
జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, మపోసా, మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, మైయర్స్, ముజర్బానీ, రిచర్డ్ నగర్వా.
Zimbabwe squads for ODI, T20I series against Pakistan named
— Zimbabwe Cricket (@ZimCricketv) November 18, 2024
Details ?https://t.co/U7VhNlrTpf pic.twitter.com/smkdeIDfFn
వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్:
- మొదటి వన్డే: నవంబర్ 24(బులవాయో)
- రెండో వన్డే: నవంబర్ 26 (బులవాయో)
- మూడో వన్డే: నవంబర్ 28 (బులవాయో)
- మొదటి టీ20: డిసెంబర్ 01 (బులవాయో)
- రెండో టీ20: డిసెంబర్ 03 (బులవాయో)
- మూడో టీ20: డిసెంబర్ 05 (బులవాయో)