హైదరాబాద్, వెలుగు: కోవిడ్-–19 ట్రీట్మెంట్ కోసం వాడే డ్రగ్‌ను జెనారా ఫార్మా భారతదేశంలో లాంచ్ చేసింది. హైదరాబాద్‌కు బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ అయిన ఇది జెనరిక్ పాక్స్‌లోవిడ్ (నిర్మత్రెల్విర్ రిటోనావిర్)ను అందుబాటులోకి తెచ్చింది. తేలికపాటి నుండి మోస్తరు లక్షణాలు ఉన్న కోవిడ్-19 రోగులకు ఈ ట్యాబ్లెట్లను వాడుతారు. జెనరా ఫార్మా పాక్స్‌లోవిడ్ అమ్మకాల కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుండి పోయిన నెలలో అనుమతిని పొందింది.
'పాక్స్‌జెన్' బ్రాండ్ పేరుతో అమ్మే ఈ ప్రొడక్టును హైదరాబాద్‌లోని జెనారా యూఎస్ఎఫ్డీఏ, ఈయూ ఆమోదిత ఫెసిలిటీలో తయారు చేస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ చికిత్స కోసం ఫైజర్ తయారు చేసిన పాక్స్‌లోవిడ్‌ను యూఎస్ఎఫ్డీఏ కూడా ఆమోదించింది. పాక్స్‌లోవిడ్ డబ్బా ధర రూ. 5,200 ఉంటుంది. ఒక్కోదాంట్లో 150 ఎంజీ నిర్మాత్రెల్విర్ 20 టాబ్లెట్లు, పది రిటోనావిర్ 100 ఎంజీ టాబ్లెట్లు ఉంటాయని జెనారా ఫార్మా కో–ఫౌండర్జగదీష్ బాబు రంగిశెట్టి చెప్పారు.
