పోలీసుల అత్యుత్సాహం.. బైకర్ను కాలితో తన్నిన ట్రాఫిక్ సీఐ

రంగారెడ్డి: చేవెళ్లలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వాహనదారుడిని చితకబాదారు. ఘోరంగా తిడుతూ.. కాళ్లతో తన్నుతూ బైకర్ ను ఈడ్చుకెళ్లారు. చేవెళ్ల లోని శంకర్ పల్లి రోడ్డులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చేవెళ్లలోని శంకర్ పల్లి రోడ్డులో బుధవారం జూలై 23, 2024 న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు  చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ జందార్ శీను, హోంగార్డ్ కేశవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వాహనదారుడికి ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ జందార్ శీను, హోంగార్డ్ కేశవ్ లు బైకర్ ను చితకబాదారు.

ALSO READ | CC కెమెరాలో దొంగ రిక్వెస్ట్ : సినిమా లెవల్‌లో చోరీ సీన్

బూతులు తిడుతూ, కాళ్లతో తన్నుతూ ఈడ్చుకెళారు. పోలీసులు బైకర్ ను కొడుతుండగా.. మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోమ్ గార్డ్ కేశవ్ ల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.