Yuzvendra Chahal: మరో అమ్మాయి బౌల్డ్.. 'మిస్టరీ గర్ల్'తో యుజ్వేంద్ర చాహల్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల దిశగా పయనిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అందునా ఈ జంట గత మూడు నెలలుగా విడివిడిగా జీవిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ అనూహ్య పరిణామాల నడుమ భారత స్పిన్నర్ మరో అమ్మాయితో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ కంటపడ్డాడు . 

ALSO READ | చాహల్ - ధనశ్రీ సంసారంలో చిచ్చు.. ఎవరీ ప్రతీక్ ఉటేకర్..?

చాహల్ ఇటీవల ముంబైలోని JW మారియట్ హోటల్‌లో గుర్తు తెలియని 'మిస్టరీ గర్ల్'తో కనిపించాడు. తెల్లటి ఓవర్‌సైజ్ టీ-షర్టు, బ్యాగీ జీన్స్‌లో సాధరించిన భారత క్రికెటర్, కెమెరా కంట పడకుండా ఉండేందుకు ఆపసోపాలు పడ్డాడు. స్తంభాల వెనుక దాక్కోవడం, చేతితో  ముఖాన్ని కవర్ చేయడం వంటివి చేశాడు. అతను ఎన్ని చేసినా.. ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. 'మిస్టరీ గర్ల్'తో చాహల్ ఉన్న ఫోటోలను తీసి నెట్టింట పోస్ట్ చేశారు. అదే సమయంలో అతనితో ఉన్న యువతి తమ బంధాన్ని బయట పెట్టండి అన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది.

చిన్ననాటి స్నేహితురాలు..!

చాహల్‌తో ఉన్న అమ్మాయి వివరాలు ఏంటనేది తెలియరానప్పటికీ, వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులని ఓ స్పోర్ట్స్ ఛానెల్ ప్రచురించింది. ధనశ్రీతో ప్రేమాయణానికి ముందు ఆమె.. భారత క్రికెటర్‌కు ప్రపోజ్ చేసినట్లు కథనంలో రాసుకొచ్చింది. బహుశా..! ప్రస్తుతం ధనశ్రీ దూరమయ్యింది కదా.. చాహల్‌ను ఓదార్చడానికి దగ్గరయ్యిందన్న మాటలు వినపడుతున్నాయి. ఏమో మరి నాలుగు రోజులు ఆగితే, చాహల్ ఈ విషయాన్ని బయట పెట్టొచ్చు.