ఉత్కంఠ రేపుతున్న వైసీపీ తుది జాబితా - లిస్ట్ లో ఉండేదెవరో..!

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కోడ్ అమలులోకి రానుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఒకవైపు, వైసీపీ తుది జాబితా ప్రకటన మరొకవైపు వెరసి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రెట్టింపయ్యింది. ఇడుపులపాయలో ప్రకటించనున్న అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాడు జగన్. ఈ జాబితాలో ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.

సీఎం జగన్ ఇలాఖా కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులకే ఛాన్స్ ఉంటుందని, కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, మిగతా పది అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా సిట్టింగుల పేర్లనే అనౌన్స్ చేయనున్నారని సమాచారం అందుతోంది.ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ కు నివాళులు అర్పించిన తర్వాత ఆయన సమాధి వద్దనే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు జగన్. 175 అసెంబ్లీ స్థానాలకు, 25ఎంపీ స్థానాలకు గాను రెడీ చేసిన ఈ జాబితాను ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేష్ ప్రకటించనున్నారు.