చంద్రబాబు, మోడీ, పవన్కు థ్యాంక్స్ చెప్పిన వైఎస్సార్సీపీ

తాము అధికారంలోకి రాగానే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని టీడీపీ చీఫ్ చంద్రబాబు  ప్రకటించడంపై వైఎస్సార్ సీపీ ట్విట్టర్లో స్పందించింది. వాలంటీర్ వ్యవస్థ శక్తిని గుర్తించినందుకు చంద్రబాబు,మోదీ, పవన్ కు థ్యాంక్స్ చెప్పింది. ఇది జగనన్న పాలన విజయానికి నిదర్శనం. అందుకనే విపక్షాలు కూడా ఆదరించి, పాటించాలనుకునేలా చేసింది. మీరేం చింతించకండి జూన్ 4న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే వాలంటీర్ వ్యవస్థను పునరుద్దరిస్తాం అని ట్వీట్ చేసింది. 

రాష్ట్రంలోని వాలంటీర్లకు   తాము అధికారంలోకి రాగానే.. వాలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామని ఉగాది పర్వదినాన  చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్లు రూ. 5 వేల గౌరవ వేతనం పొందుతున్నారు.  

also read : టీడీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రమేష్ కుమార్ రెడ్డి