జాతీయ జెండాకు అవమానం జరిగింది. గ్రామ సచివాలయం గోడపై ఉన్న జాతీయ జెండా పై ఏపీ అధికార పార్టీ వైసీపీ జెండా రంగులు వేశారు.
ఎంతోమంది త్యాగాల ఫలితం కారణంగా మనకు స్వాంత్ర్యం వచ్చింది. వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ జాతీయ జెండా వేడుకల్ని నిర్వహించడం ఆనవాయితీ. వేడుకల సందర్భంగా జాతీయ జెండాల్ని ఆవిష్కరించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను గోడలపై రంగులతో తీర్చిదిద్దుకుంటాం.
అయితే జాతీయజెండా వేడుకల్ని, జాతీయ జెండాలను అధికార పార్టీలు స్వలాభం కోసం వినియోగించుకుంటున్నాయి. సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే..ఆ పార్టీ ప్రతిభింబిచేలా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ సచివాలయాలపై పార్టీ గుర్తులతో నింపేయడం సర్వసాధారణం.
కానీ ఏపీ అధికారపార్టీ వైసీపీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గుర్తుల్ని స్మశానాల్లో, బస్టాండ్ లలో ఆ పార్టీ నీలిరంగు గుర్తులతో హడావిడి చేస్తుంది.
అనంతపురం జిల్లా తమ్మడ పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయంపై ఉన్న జాతీయ జెండా గుర్తుల్ని తొలగించి..వైసీపీ పార్టీ గుర్తు నీలం రంగు పెయింట్ వేశారు.
అయితే వైసీపీ నేతల తీరుపై దేశభక్తులు, గ్రామస్తులు, నెటిజన్లు మండిపడుతున్నారు. పార్టీ పై ప్రేమ ఉంటే జాతీయ జెండాను ఎలా అవమానిస్తారని ప్రశ్నిస్తున్నారు. జాతీయ జెండాను అవమానించేలా పెయింట్ వేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారాయి.
వీడియోలపై స్పందించిన నారాలోకేష్.. ఇదీ వైసీపీ నేతల దేశభక్తి, మన జాతీయపతాకం పట్ల ఉన్న గౌరవం. ఇంత నిస్సిగ్గుగా జాతీయ పతాకానికి కూడా వైసీపీ పార్టీ రంగులు వేస్తున్నారంటే, రేపు జాతీయపతాకం స్థానంలో వైసీపీ జెండాని ఎగరేస్తారేమో! స్మశానాలను ఎలాగూ వదలడం లేదు, కనీసం జాతీయ జెండాని అయినా గౌరవించండి జగన్ అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు.
ఇదీ వైకాపా నేతల దేశభక్తి, మన జాతీయపతాకం పట్ల ఉన్న గౌరవం. ఇంత నిస్సిగ్గుగా జాతీయ పతాకానికి కూడా వైకాపా పార్టీ రంగులు వేస్తున్నారంటే, రేపు జాతీయపతాకం స్థానంలో వైకాపా జెండాని ఎగరేస్తారేమో! స్మశానాలను ఎలాగూ వదలడం లేదు, కనీసం జాతీయ జెండాని అయినా గౌరవించండి @ysjagan గారు! pic.twitter.com/kRQCyRvVFQ
— Lokesh Nara (@naralokesh) October 29, 2019
