అమరావతి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జీలతో ఐదో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు విడతలుగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జీలను నియమించిన సీఎం వైఎస్ జగన్.. తాజాగా ఐదో జాబితాను బుధవారం (జనవరి 31) విడుదల చేశారు. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్ట రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంఛార్జీల మార్పులను ప్రకటించారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి వైయస్ఆర్సీపీ తరపున నాలుగు పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జ్‌లను మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, నర్సరావుపేట ఎంపీ స్థానాలకు, సత్య… pic.twitter.com/jrJXBeseEk
— YSR Congress Party (@YSRCParty) January 31, 2024
ఎంపీ ఇంఛార్జీలు
- కాకినాడ (ఎంపీ)- చలమలశెట్టి సునీల్
- నర్సరావుపేట(ఎంపీ)-అనిల్‌కుమార్ యాదవ్
- తిరుపతి (ఎంపీ)-గురుమూర్తి
- మచిలీపట్నం (ఎంపీ)- సింహాద్రి రమేష్ బాబు
ఎమ్మెల్యే ఇంఛార్జీలు
- సత్యవేడు (ఎమ్మెల్యే) - నూకతోటి రాజేష్
- అరకు వేలి (ఎమ్మెల్యే)- రేగం మత్స్యలింగం
- అవనిగడ్డ (అసెంబ్లీ) - డా.సింహాద్రి చంద్రశేఖరరావు
వైఎస్సార్ సీపీ ఐదో జాబితా విడుదల...
— YSR Congress Party (@YSRCParty) January 31, 2024
నాలుగు పార్లమెంట్ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలకు సంబందించి జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ,సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు.#YSJaganAgain pic.twitter.com/7XVR6PWeNK