కడప ఎంపీగా షర్మిల పోటీ.. వైసీపీకి చెక్ తప్పదా..?

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల 2024 ఏపీ ఎన్నికల బరిలో దిగనున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగుతుందని, మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇదే గనక నిజమైతే వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చెక్ తప్పదనే చెప్పాలి. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని పీసీసీ చీఫ్ గా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి జగన్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు షర్మిల కు తోడు వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత కూడా తోడవ్వడంతో సొంత జిల్లాలో జగన్ కు ఎదురీత తప్పదా అన్న అనుమానం కలుగుతోంది.

కడప ఎంపీగా షర్మిలను బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తోంది.
అయితే, షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండడటంతో బరిలోకి దిగుతారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా విడుదల కానుంది. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండంతో టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో షర్మిల అవినాష్ కి పోటీగా బరిలో దిగుతారా లేక పులివెందుల నుండి ఎమ్మెల్యేగా జగన్ మీద పోటీకి దిగుతారా అన్నది వేచి చూడాలి.

Also Read:టీడీపీకి బిగ్ షాక్ - వైసీపీలోకి సీనియర్ నేత..!