కడప బరిలో షర్మిల - అవినాష్ కు చెక్ తప్పదా..

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. కడప పార్లమెంట్ స్థానం నుండి షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసిందని, సోమవారం ఈ మేరకు అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది. సోమవారం పరకటించే కాంగ్రేస్ ఏపీ అభ్యర్థుల జాబితాలో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పేరు ఉండనుందని తెలుస్తోంది. కడప పార్లమెంట్ బరిలో వైసీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ నుండి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల సీన్లోకి ఎంటర్ అవ్వటంతో కడప పార్లమెంట్ బరిలో హోరాహోరీ పోటీ ఖాయమని అనిపిస్తోంది.

షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి జగన్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరో పక్క దివంగత వివేకానంద రెడ్డి కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ కూడా వైసీపీ పట్ల వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి క్షేత్ర స్థాయిలో ప్రతికూలత తప్పదేమోనన్న సంకేతాలు వస్తున్నాయి. మరి, హోరాహోరీ పోరులో ఎప్పటిలాగే వైసీపీది పైచేయి అవుతువుందా లేక వైసీపీని గద్దె దించాలన్న షర్మిల పంతం నెగ్గుతుందా అన్నది వేచి చూడాలి.