సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీలను కలిసిన వైఎస్ షర్మిలా 

న్యూఢిల్లీ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలో కలిశారు. 10 జన్ పథ్ లోని సోని యా ఇంటికి వెళ్లిన షర్మిలా.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకునే నిర్ణయాలపై చర్చించారు. ఈక్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలిసినట్లు ట్వీట్ చేశారు. 10 జన్ పథ్ లో ప్రేమ, సంరక్షణ, ప్రేరణ గురించి ట్వీట్ లో రాశారు. ఇది కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆమెకు లభిస్తున్న బలమైన మద్దతును సూచిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల.. తన సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోరాడి ఎన్నికల ముందు సందడి చేశారు. జగన్ అవినీతి, లిక్కర్ పాలసీలు, జాబ్ క్యాలెండర్, ఏపీ ప్రజలను ఎలా మోసం చేశారంటూ జగన్ పై ఆమె తీవ్రస్థాయిలోనే విమర్శించారు. 

 వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్ షర్మిల చేస్తున్న వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఒకానొక సందర్భంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల గెలుస్తారన్న అంచనాలు ఉన్నపటికీ ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు.