ఈ శతాబ్దపు పెద్ద జోక్ అదే.. జగన్ కు షర్మిల కౌంటర్..

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదం రోజురోజుకీ ముదురుతోంది. వైఎస్ విజయమ్మ కూడా షర్మిలకే మద్దతు పలుకుతూ బహిరంగ లేఖ విడుదల చేయటంతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో జగన్ ను ఉద్దేశించి మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు.ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని రూ. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని అన్నారు. 

షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని.. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదని అన్నారు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ.. వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని అన్నారు. 2016 లో ఈడీ భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా జగన్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. 2019 లో తనకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU మీద సంతకం చేశారని గుర్తు చేశారు షర్మిల.అప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అంటూ ప్రశ్నించారు.

2021 లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన , సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని ప్రశ్నించారు. షేర్స్ ట్రాన్స్ఫర్ కి , బెయిల్ రద్దుకు సంబధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారని...ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ సీఎల్టీ లో కేసు ఉంది కాబట్టి.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని .. కొడుకు బెయిల్ కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మ గారికి తెలుసని అన్నారు షర్మిల.