నేను ఓడితే నేరం గెలిచినట్టే.. షర్మిల

జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలపై నాన్ స్టాప్ గా విమర్శనాస్త్రాలు సందిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల ఎన్నికల ప్రచారంలో జగన్, అవినాష్ లపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా రావులపాలెంలో మీడియా సమావేశంలో  పాల్గొన్న షర్మిల జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్లే అని అన్నారు.

ఈ ఎన్నికలు ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్నాయని అన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి పేరును చార్జిషీట్లో చేర్చింది కాంగ్రెస్ అని ఆరోపిస్తున్నారని, వైఎస్ఆర్ పేరు ఎఫైఆర్ లో లేకపోతే ఏఏజీ సుధాకర్ రెడ్డి చేర్పించారని అన్నారు. తనపై ఉన్న కేసుల నుండి బయటపడేందుకే జగన్ వైఎస్ఆర్ పేరును చార్జిషీట్లో చేర్పించారని అన్నారు షర్మిల. జగన్ రిమోట్ కంట్రోల్ ఐదేళ్లుగా మోడీ చేతిలో ఉందని అన్నారు షర్మిల.