పల్నాడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు.వినుకొండలో ఆయన పర్యటప సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. రెండు రోజుల క్రితం వైసీపీ కార్యకర్త రషీద్ ను హత్య చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన జగన్ ... రషీద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. హత్య ఎలా జరిగిందో జగన్ రషీద్ తల్లి దండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో జరుగుతున్న దాడుల విషయంలో ప్రధాని మోదీని కలుస్తామన్నారు. త్వరలో ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు.
టీడీపీ నాయకులతో నిందితుడు జిలానీ ఉన్న ఫొటోలను రషీద్ తల్లిదండ్రులు జగన్ కు చూపించారు. ఇంకా తమను బెదిరిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు జగన్కు వివరించారు. జిలానీ ఫోన్ కాల్ రికార్డ్ బయటకు తీస్తే హత్య వెనుక ఉన్నారో తెలుస్తుందన్నారు. రాజకీయ కక్షతో తమ కొడుకును బలి తీసుకున్నారని రషీద్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్ లోచేర్చలేదని.. ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని రషీద్ కుటుంబసభ్యులు జగన్ కు వివరించారు. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు జగన్.