రేపు విశాఖకు జగన్ : స్వరూపానందను కలవాలని నిర్ణయం

రేపు విశాఖకు జగన్ : స్వరూపానందను కలవాలని నిర్ణయం
  • స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని జగన్ నిర్ణయం!
  • మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కోసమే
  • స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్న జగన్

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.
మంగళవారం వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు వెళ్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. రేపు విశాఖ చేరుకునే ఆయన, స్వరూపానందను ముందుగా దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి అమరావతి చేరుకుంటారు.

సీఎంగా ఇప్పటికే ప్రమాణం చేసిన వైఎస్ జగన్… మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని కూడా స్వామి స్వరూపాంద ఖరారు చేసినట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. తాజాగా.. మంత్రి వర్గ విస్తరణ ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలను జగన్ తీసుకోనున్నారని తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు శారదా పీఠాధిపతిని జగన్ కలిశారు. హైదరాబాద్ లో చినజీయర్ స్వామిని కూడా కలుసుకున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్… స్వరూపానందను దర్శించుకోలేదు.

ఈ కారణాలతో… రేపు విశాఖలో స్వరూపానందను కలిసి ఆశీస్సులు తీసుకుని.. కృతజ్ఞతలు తెలపాలని జగన్ నిర్ణయించుకున్నారు.