సీఎం జగన్ కోసం తమిళనాడుకు చెందిన స్వర్ణకారుడు అపురూపమైన కానుక సిద్ధం చేస్తున్నాడు.తిరుపత్తూరు జిల్లా ఆంబూరూలో నివాసం ఉంటున్న దేవన్, సీఎం జగన్ సంక్షేమ పథకాలకు, పాలనపై ఆకర్షితులయ్యారు. అందుకు గుర్తుగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను బంగారంతో రూపొందిస్తానని, జగన్ కు అందిస్తానని దేవన్ తెలిపాడు. ఈ సందర్భంగా దేవన్ మాట్లాడుతూ సీఎం జగన్ ఏపీలో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఆయన కోసం పసిడితో చేసిన ఏపీ మ్యాప్ అందిస్తానని దేవన్ వెల్లడించాడు. కాగా, దేవన్ బక్రీద్ సందర్భంగా బంగారం, వెండితో మసీదు ప్రతిమను రూపొందించాడు
