జగన్ కోసం జనం మధ్యలో భారతి...

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా జిల్లాలోకి జగన్ చేరుకున్న నేపథ్యంలో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. బస్సు తాడేపల్లికి చేరుకోగానే అకస్మాత్తుగా జనం మధ్యలో సీఎం సతీమణి వైఎస్ భారతి ప్రత్యక్షమయ్యారు. జనం మధ్యలో నిలబడి జగన్ కు అభివాదం చేశారు భారతి. ఇందుకు బదులుగా జగన్ కూడా బస్సు మీద నుండి అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

ఈ సంఘటన వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిందని చెప్పాలి. మేమంతా సిద్ధం సభలకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. జగన్ కూడా డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్తాపిద్దామన్న నినాదంతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.