మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలి.. షర్మిలకు అవినాష్ కౌంటర్..

ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో జనంలోకి వెళ్లిన నేపథ్యంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. ఈసారి రాష్ట్ర రాజకీయం అంతా ఒక ఎత్తైతే, కడప జిల్లా రాజకీయం మరో ఎత్తు అన్నట్లు తయారైంది పరిస్థితి. మాజీ మంత్రి వివేకా హత్య కేసు చుట్టూ తిరుగుతున్న కడప రాజకీయం ఎన్నికల నేపథ్యంలో మరింత వేడెక్కింది. జిల్లాలో ప్రచారం చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వైసీపీ అవినాష్ ను హంతకుడు అంటూ ప్రత్యక్షంగా చేసిన ఆరోపణలు సంచలంగా మారాయి.

షర్మిల వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, ఎన్ని మాటలు అంటారో అనండి ఎంత ప్రచారం చేస్తారో చేయండని అన్నారు.వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని, మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలని అన్నారు. బురద చల్లి, మసి పూసి తుడుచుకోమంటారని, తడుచుకుంటూ పొతే, బురద చల్లుతూనే ఉంటారని అన్నారు.