యువతకు ట్రైనింగ్‌తో పాటు అప్పు కూడా ఇచ్చి బిజినెస్ పెట్టించే కొత్త స్కీం

యువతకు ట్రైనింగ్‌తో పాటు అప్పు కూడా ఇచ్చి బిజినెస్ పెట్టించే కొత్త స్కీం
ఎంట్రప్రెనూర్ల కోసం కొత్త స్కీమ్ వచ్చే ఐదేళ్లలో 3 లక్షల మందికి శిక్షణ పీఎం-ఉమీద్ కింద ప్రభుత్వం సపోర్ట్ న్యూఢిల్లీ: దేశంలో మరింత మంది ఎంట్రప్రెనూర్లను తయారు చేసేందుకు, కష్టాల్లో ఉన్న సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్‌‌తో ముందుకు రాబోతోంది. పీఎం ఉద్యం మిత్రా ఫర్ ఎక్స్‌‌లెన్స్ ఇన్‌‌ ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్ డెవలప్‌‌మెంట్ (పీఎం ఉమీద్) అనే డ్రాఫ్ట్‌‌ స్కీమ్‌ను  స్కిల్స్ డెవలప్‌‌మెంట్ మినిస్ట్రీ తయారు చేసింది. ఈ స్కీమ్ కింద వచ్చే ఐదేళ్లలో 3 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి అప్పులు ఇప్పించడం, మార్కెట్లలో నిలదొక్కుకునేలా సహకరించడం ప్రభుత్వం అందించనుంది. ఈ ఎంట్రప్రెనూర్లను ఉద్యోగాలు అందించే వారిగా తీర్చిదిద్దనుంది. కరోనా దెబ్బకు జాబ్ మార్కెట్ బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. జాబ్ మార్కెట్‌‌కు సాయం అందించేందుకు ప్రభుత్వం ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్‌‌ను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తెస్తోన్న ఈ స్కీమ్ త్వరలోనే కేబినెట్ ముందుకు రానుంది. రాష్ట్రాలు ఆసక్తిగల ఎంట్రప్రెనూర్లను, వెంచర్లను గుర్తించి ఈ స్కీమ్ కింద వారికి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎంట్రప్రెనూర్‌‌‌‌షిప్ డెవలప్‌‌మెంట్ ట్రైనింగ్  రెండు నెలలు ఉంటుంది. ఆ తర్వాత 18 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం వారికి మద్దతుగా నిలవనుంది. కేబినెట్ నుంచి ఈ పాలసీకి ఆమోదం రాగానే బోర్డు పాలసీ, మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఈ స్కీమ్‌‌ బాధ్యతంతా ఎగ్జిక్యూటివ్ కమిటీ చేతిలో ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అన్నింటిన్నీ ఇదే ఆమోదిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ ప్రారంభమవుతుందని, 2025–26 వరకు దీన్ని నిర్వహిస్తారని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. నిధుల కోసం అప్పులిచ్చే సంస్థలు, మార్కెట్లతో లింక్… రెండు నెలల శిక్షణ తీసుకున్న తర్వాత ఈ ఎంట్రప్రెనూర్లు నిధులు సేకరించుకునేందుకు మార్కెట్లతో, అప్పులిచ్చే సంస్థలతో లింక్ కావొచ్చు. ఎంట్రప్రెనూర్‌‌‌‌కు సంబంధించిన సర్వీసులు పొందేందుకు డిజిటల్ అగ్రిగేటర్ ప్లాట్‌‌ఫామ్‌‌తో కూడా కనెక్ట్ అవ్వొచ్చు.  ఈ స్కీమ్ ద్వారా ప్రస్తుతమున్న 25 శాతం, రాబోతున్న 75 శాతం మంది ఎంట్రప్రెనూర్లకు ప్రయోజనం కలుగనుందని కేంద్రం చెబుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం లాక్‌‌డౌన్‌‌ విధించిన తొలి నెలలో 12.1 కోట్ల మంది వర్కర్లు ఉద్యోగాలు కోల్పోయారు. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు పోయింది ఇప్పుడే. నవంబర్ 22 ముగిసే నాటికి ఇండియాలో నిరుద్యోగ రేటు 7.8 శాతానికి పడిపోయింది.   For More News.. అమెజాన్ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే డబ్బులంటూ స్కాం.. లక్షల్లో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు