బీర్ బాటిల్లో పేరుకుపోయిన చెత్త.. లబోదిబోమన్న మద్యం ప్రియుడు..

మహబూబాబాద్ జిల్లాలో ఓ మద్యం ప్రియుడికి షాక్ తగిలింది.. చిల్డ్ బీర్ తాగి సేదతీరుదామనుకున్న యువకుడికి బీర్ బాటిల్లో పేరుకుపోయిన చెత్తను చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. శనివారం ( డిసెంబర్ 21, 2024 ) మహబూబాబాద్ జిల్లా  గూడూరులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

గూడురోలని శ్రీ వెంకటేశ్వర వైన్ షాపులో బిరు కొనుగోలు చేసిన యువకుడు బీర్ బాటిల్ మూత తీసి చూడగా..  చెత్త భారీ మొత్తంలో కదలాడుతుండడంతో అవాక్కయ్యాడు. దీంతో షాపు ముందు ఆందోళనకి దిగాడు యువకుడు. చివరకు చెత్త బీరుకు బదులు మరో బీరు ఇవ్వడంతో  అక్కడ నుంచి వెళ్లిపోయిన బాధితుడు.

బీర్ బాటిల్లో చెత్త, పురుగులు, కప్పలు వంటివి రావటం తరచూ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు మద్యం ప్రియులు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తరహాలో ఎక్సయిజ్ శాఖ అధికారులు కూడా డిస్టిలరీస్ లో తనిఖీలు చేప్పట్టి నాణ్యతా ప్రాణాలు పాటించని డిస్టిలరీస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మద్యం ప్రియులు.