తహసీల్దార్ ను కలిసిన కాంగ్రెస్ నేత

వంగూర్, వెలుగు : యూత్  కాంగ్రెస్  అచ్చంపేట వర్కింగ్  ప్రెసిడెంట్  క్యామ మల్లయ్య సోమవారం తహసీల్దార్  మురళీమోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో 

అధికారులు అలసత్వం వహించకుండా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలం కావడంతో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు.