యాక్సిడెంట్స్​కు అధికంగా బలవుతున్న యువత

అధిక స్పీడ్,  నిర్లక్ష్యం కారణంగా ప్రయాణాల్లో ఎక్కువగా యువతనే ప్రమాదాలకు గురవున్నది.  ప్రాణాలూ కోల్పోతున్నారు.   ఒక్కోసారి యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకరు ఇద్దరు మాత్రమే కాదు. ఏకంగా పదుల సంఖ్యలో చనిపోతున్నారు. దీంతో  రోడ్లపై  జర్నీ  చేయాలంటే ప్రజలు హడలిపోతున్నారు.   రోడ్డు ప్రమాదాలు  జరగకుండా  ఎన్నో  కఠినచర్యలు  తీసుకున్నా వాహనదారులు కనీస జాగ్రత్తలు  తీసుకోవడం లేదు.  ముఖ్యంగా  అధిక స్పీడ్,  నిర్లక్ష్యపు డ్రైవింగ్,  డ్రంకన్ డ్రైవ్ , హెల్మెట్ ధరించకపోవడం, ఇలా రూల్స్​ అన్నింటిని  పెడచెవిన పెడుతున్నారు.  రోడ్డు  ట్రాఫిక్  క్రాష్​ల  వల్ల  చాలా దేశాలు  వాటి  స్థూల దేశీయోత్పత్తిలో 3 శాతానికి పైగా నష్టపోతున్నాయి.

భారత్​లో  దాదాపు  ప్రతి  మూడున్నర  నిమిషాలకు  ఒకరు  రోడ్డు ప్రమాదంలో  మరణిస్తున్నారు.  సగటున  ప్రతిరోజూ 1,264 రోడ్డు ప్రమాదాలు,  462 మరణాలు సంభవిస్తున్నాయి.  భారతదేశంలోని  రహదారుల  పొడవులో జాతీయ  రహదారులు కేవలం 2% మాత్రమే ఉన్నాయని,  అయితే  మొత్తం రోడ్డు ప్రమాదాల్లో  30.3%,  మరణాలలో 36% మాత్రమే జాతీయ రహదారులు ఉన్నాయని ఐఐటీ  ఢిల్లీ చేసిన అధ్యయనంలో  వెల్లడైంది.  రోడ్డు ప్రమాదాల కారణంగా  ప్రతి సంవత్సరం సుమారు  ప్రపంచవ్యాప్తంగా 1.19 మిలియన్ల మంది మరణిస్తున్నారు. 

5-–29 సంవత్సరాల వయస్సు గల పిల్లలు,  యువకుల మరణాలకు  రోడ్డు ప్రమాద గాయాలు ప్రధాన  కారణంగా మారుతున్నాయి.  ప్రపంచంలోని  వాహనాల్లో  దాదాపు 60%  అగ్రదేశాల్లో  ఉన్నప్పటికీ,  92% రోడ్డు  ప్రమాదాలు తక్కువ.  మధ్య- ఆదాయ  దేశాలలో ఎక్కవగా ప్రమాదాలు  సంభవిస్తున్నాయి.  రోడ్డు  ప్రమాద మరణాలలో సగానికి పైగా పాదచారులు, సైక్లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైకిలిస్ట్​లు  ఉన్నారు.   ఐక్యరాజ్యసమితి  జనరల్ అసెంబ్లీ 2030 నాటికి  రోడ్డు  ప్రమాదాల వల్ల  ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలు  సంఖ్య తగ్గేలా  లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఏడాది భారీగా పెరిగిన యాక్సిడెంట్లు

గత  సెప్టెంబర్  30 వరకు  రాష్ట్రంలో మొత్తం 18,991 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.  ఈ  ప్రమాదాల్లో  5,606 మంది  ప్రాణాలు కోల్పోగా, 17,689 మంది  తీవ్రంగా గాయపడ్డారు.  ఈ లెక్కన  రాష్ట్రవ్యాప్తంగా  ప్రతిరోజు సగటున 70 ప్రమాదాలు జరుగగా. 21 మంది ప్రాణాలు విడిచారు. అయితే,  గతేడాది కంటే ఈ ఏడాది యాక్సిడెంట్ల సంఖ్య భారీగా పెరిగింది.  గత సంవ త్సరంతో పోలిస్తే 2,075 ప్రమాదాలు ఎక్కువ.  ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే గ్రేటర్  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ  యాక్సిడెంట్లు జరిగాయి.  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  దాదాపు  మూడు కమిషనరేట్ల  పరిధిలో  7,168 యాక్సిడెంట్లు జరిగాయి.  ఈ యాక్సిడెంట్లలో 1,430  మంది ప్రాణాలు విడిచారు.  అలాగే దీని తర్వాత వరంగల్  కమిషనరేట్ పరిధిలో 1,027 ప్రమాదాలు జరిగాయి.  అందులో 338 మంది చనిపోగా 1,019 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా రోజు రోజుకూ  ప్రమాదాలు పెరిగిపోవడంతో  ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని బట్టి చూస్తే  గ్రేటర్  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పరిధిలో  ఎప్పటిలాగే  రోడ్డు  ప్రమాదాల సంఖ్య పెరిగింది.  దీని తర్వాత స్థానంలో వరంగల్ నిలిచింది.  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ట్రాఫిక్ రద్దీ ఉండే సమయంలోనే  అంటే ఉదయం 8  నుంచి- 11గంటలు,  అలాగే సాయంత్రం 6 నుంచి- 8 గంటల మధ్యలో  ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా  రాత్రి 11 గంటల తర్వాత టూ వీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  వెళ్లేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని పోలీస్ కేస్ స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చెప్తున్నాయి.  కానీ,  ఇతర  భారతీయ  రహదారులపై  ఎక్కువగా  ప్రమాదాలకు గురయ్యే సమయం మధ్యాహ్నం,  సాయంత్రం పీక్ అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. 

పటిష్ట కార్యాచరణతో రోడ్డు ప్రమాదాల నివారణ 

రోడ్డు ప్రమాదాలను  పటిష్ట  కార్యాచరణతో  నివారించవచ్చు.  రహదారి భద్రతను  పరిరక్షించేందుకు  ప్రభుత్వాలు  సమగ్ర  చర్యలు తీసుకోవాలి.  దీనికి  రవాణా,  పోలీసు,  అలాగే  ప్రైవేట్ రంగాలు,  పౌర సమాజ సంస్థల వంటి  బహుళ రంగాల ప్రమేయం అవసరం.   రహదారి  భద్రతా అంశాలను  భూవినియోగం  రవాణా ప్రణాళికలో చేర్చడం,  వాహనాల భద్రతా ప్రమాణాలను మెరు గుపరచడం,  రోడ్డు   ప్రమాదాల బాధితులకు  పోస్ట్- క్రాష్  సంరక్షణను మెరుగుపరచడం,  ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్,  కారు నడిపేటప్పుడు లేదా  కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు  తప్పనిసరిగా ధరించాలి.

ట్రాఫిక్ సిగ్నల్, రోడ్  నియమ,  నిబంధనలను పాటించాలి.  మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలకు  ప్రమాదం.  వాహన వేగ పరిమితిని పాటించడం ముఖ్యం. పాదచారుల రక్షణ కోసం జీబ్రా క్రాసింగ్ వద్ద వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయాణికలు తమ వాహనాల్లో రక్షణ పరికరాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలి.    రోడ్డు ప్రమాదాల నివారణకు కీలకమైన  చట్టాలను ఏర్పాటు చేయడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంతోపాటు, రోడ్డు యాక్సిడెంట్లపై  ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించవచ్చు.

బాధితుల్లో 68 శాతం యువతే 

రోడ్డు యాక్సిడెంట్​ మరణాలలో 90% కంటే ఎక్కువ మధ్య- ఆదాయ దేశాలలో సంభవిస్తున్నాయి.  రోడ్డు  యాక్సిడెంట్ల  మరణాల శాతం  డబ్ల్యూహెచ్ఓ  ఆఫ్రికన్  రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా,  యూరోపియన్ ప్రాంతంలో అత్యల్పంగా ఉన్నాయి. అధిక- ఆదాయ దేశాలలో కూడా తక్కువ సామాజిక,  ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు రోడ్డు ప్రమాదాల బాధితుల్లో  ఎక్కువగా ఉన్నారు.   రోడ్డు యాక్సిడెంట్​ మరణాలలో మూడింట రెండు వంతుల మంది  పనిచేసే వయస్సు (18-–59 సంవత్సరాలు) వ్యక్తులు ఉంటున్నారు. రోడ్డు ప్రమాదాలలో ఆడవారి కంటే పురుషులు సాధారణంగా 3 రెట్లు ఎక్కువగా చనిపోతున్నారు. 

యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో దాదాపు 68 శాతం మంది యువతే ఉంటున్నారని  పోలీసులు చెబుతున్నారు.  కాగా,  ఈ సంవత్సరం కేవలం 9 నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అధికసంఖ్యలో యాక్సిడెంట్లు అయ్యాయి.  కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది  గాయాల పాలయ్యారు.  మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ  సంఖ్యలో  రోడ్డు  ప్రమాదాలు జరుగుతున్నాయి.   రాంగ్​రూట్​లో  డ్రైవింగ్ చేయడం (5.8 శాతం),  మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేయడం వల్ల (2.5 శాతం) ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

-  డా. బి. కేశవులు.
ఎండి. సైకియాట్రీ,
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం