మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ తయారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ

మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ తయారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ
మీ ఫోన్ మీ ఇష్టం..లావా కస్టమర్లకు నచ్చిన రీతిలో తయారీ న్యూఢిల్లీ: మీకు నచ్చిన రీతిలో.. మీకు కావాల్సిన ఫీచర్లతో ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే మొబైల్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ మీకు నచ్చే.. మీరు కోరుకునే ఫోన్‌‌‌‌ను తయారు చేసి ఇస్తామంటోంది. కెమెరా, మెమరీ స్టోరేజ్ కెపాసిటీ, కలర్ ఇలా ఏ ఫీచర్ అయినా.. మీరు కోరుకునే విధంగానే అరేంజ్ చేసి ఫోన్‌‌‌‌ను తయారు చేస్తామని చెబుతోంది. ప్రపంచంలో తొలి కస్టమైజ్డ్ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ను లావా గురువారం లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ సిరీస్‌‌‌‌ను మైజెడ్ పేరుతో తీసుకొచ్చింది. దేశీయంగా లావాకు ఉన్న ఫెసిలిటీలోనే దీన్ని తయారు చేసింది. ఈ నెల 11 నుంచే కొనుగోలుకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తోంది. రిక్వైర్‌‌‌‌‌‌‌‌మెంట్ మేరకు నోకియా లాంటి బ్రాండ్లకు ఈ కంపెనీ డివైజ్‌‌‌‌లను తయారు చేసి ఇస్తోంది. ఒకవేళ కస్టమర్లు ఇప్పటికే తాము వాడుతోన్న ఫోన్లను అప్‌‌‌‌గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా లావా చేసి ఇస్తుంది. ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా, ర్యామ్, రోమ్, కలర్ ఇలా ఏదైనా కస్టమర్ల ఛాయిస్ మేరకు అప్‌‌‌‌గ్రేడ్ చేస్తోంది. ఈ మొత్తం ప్రొగ్రామ్‌‌‌‌ ఇండియన్ల టాలెంట్‌‌‌‌పైనే ఆధారపడి ఉందని లావా ఇంటర్నేషనల్ చెప్పింది. For More News.. జనవరి21లోగా ఐపీఎల్ ప్లేయర్ల లిస్ట్ ఇవ్వాలి వ్యాక్సిన్ వస్తోంది.. జాబ్స్​ తెస్తోంది.. జాతీయ గీతం పాడుతూ ఏడ్చిన సిరాజ్