ఫుల్లుగా తాగించి.. కొండపైకి తీసుకెళ్లి.. ప్రేమించిన అమ్మాయి కోసం .. ఫ్రెండ్నే చంపేశాడు

  • 24 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • ఫుల్​గా మద్యం తాగించి, కొండపైకి తీసుకెళ్లిన నిందితుడు
  • ఆపై కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిండు

కీసర, వెలుగు: యువకుడి హత్య కేసును కీసర పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం.. కాప్రా మండలం ఎల్లారెడ్డి గూడకు చెందిన మహిపాల్ (24) డీజే ప్లేయర్​గా పనిచేస్తున్నాడు. పనిచేసే క్రమంలో ఆర్​జీకే కాలనీకి చెందిన పృథ్వీరాజ్ అతడికి పరిచయమయ్యాడు.పృథ్వీరాజ్​ స్నేహంతో  ఓ యువతి అతడికి పరిచయమైంది. 

తొలుత పృథ్వీని సదరు యువతి ప్రేమించింది.పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పృథ్వీని దూరం పెడుతూ మహిపాల్​తో చనువుగా ఉంటోంది. ఇది గిట్టని పృథ్వీరాజ్ కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని మహిపాల్​ను చంపి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ నెల10న మధ్యాహ్నం దమ్మాయిగూడకు మహిపాల్​ను తీసుకెళ్లి, ఫుల్​గా మద్యం తాగించాడు. అక్కడి నుంచి తన బండి మీద ఎక్కించుకొని నేరుగా హరిదాస్ పల్లి డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న కొండపైకి తీసుకెళ్లారు. ఆపై తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు పృథ్వీరాజ్​ను తన ఇంట్లో గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.