సూపర్ మార్కెట్‌లో యువతిపై అత్యాచారం.. ఘట్‌కేసర్‌లో ఘటన

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణ మార్టులో పని చేసే యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. పైగా జరిగిన విషయం బయటపెడితే, చంపేస్తానని బెదిరించాడు. గత మూడు రోజులుగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయిన యువతి ఎట్టకేలకు ధైర్యం చేసి జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలిపింది. 

అనంతరం  కుటుంబసభ్యుల సహకారంతో భాదిత యువతి ఘట్‌కేసర్‌ పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు.. గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని బషీర్(38)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ మార్ట్‌లోపలి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించనున్నారు.