పెండ్లికి డబ్బులు సర్దుబాటు కాక యువతి సూసైడ్‌‌‌‌

మరిపెడ, వెలుగు: పెండ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా మరిపెడకు చెందిన మద్దెబోయిన స్వాతి కుమార్తె తులసి (19) తల్లితో కలిసి ఇండ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తులసికి ఇటీవల ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ జరిగింది. అయితే పెండ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో తల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తులసి శనివారం ఉదయం ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి స్వాతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్వాతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.