క్లాస్ రూమ్‌లోనే విద్యార్థినికి తాళి క‌ట్టే య‌త్నం.. ఆపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

క్లాస్ రూమ్‌లోనే విద్యార్థినికి తాళి క‌ట్టే య‌త్నం.. ఆపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
కాకినాడ: ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్ధినికి క్లాస్ రూమ్ లోనే ఓ యువకుడు తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. అదే క్లాస్ లో ఉన్న విద్యార్ధిని సోదరుడు అడ్డుకోవడంతో అతను పారిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం ప్రభుత్వ పాఠశాలలో జ‌రిగిందీ సంఘ‌ట‌న‌. ఆ విద్యార్ధినిపై కన్నేసిన సత్తిరెడ్డి అనే యువకుడు క్లాస్ రూమ్ లోకి దూరి బాలిక‌కు తాళి కట్టేందుకు ప్రయత్నించాడు. అదే క్లాస్ లో ఉన్న ఆమె సోదరుడు ఆ యువకుడిని అడ్డుకొన్నాడు. దీంతో ఆ యువకుడు క్లాస్ రూమ్ నుండి పారిపోయాడు.అనంతరం ఇంటికి చేరుకొన్న సత్తిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.