రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులో ఉరేసుకున్న యువకుడు

ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రన్నింగ్ ఆర్టీసీ బస్సులో ఉరేసుకొని యువకుడు మృతి చెందాడు. బస్సు ఏర్పేడు ఏరియాలోకి వచ్చి న్నప్పుడు ఈ ఘటన జరగగా, రేణిగుంట వద్దకు చేరుకున్నాక కండక్టర్ దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

 బస్సులో లాస్ట్ సీటు దగ్గర ఉన్న హ్యాంగర్ కు ఉరేసుకుని చనిపోయాడు.  ప్రమాదం జరిగిన టైంలో బస్సులో ముగ్గురు ఫ్యాసింజర్లు మాత్రమే ఉన్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.