భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే నచ్చని అభిమాని ఎవరుంటారు చెప్పండి. భారత క్రికెట్లో ఎన్నో మార్పులకు మూలకారణం.. అతను. అందులో ఫిట్నెస్ ఒకటి. సహచర ఆటగాళ్ల శరీరాల్లో మార్పులు తెచ్చేలా చేసి మైదానంలో మెరికల్లా తీర్చిదిద్దాడు. టన్నుల కొద్దీ పరుగులు చేయాలనే తపన.. తన అగ్రెస్సివ్ నెస్‌తో ప్రపంచ క్రికెట్ లోనే రారాజు అనిపించారు. అంతటి క్రికెటర్ ఆటోగ్రాఫ్ ఇస్తే.. ఆనందానికి అవధులు ఉంటాయా..! అసలు ఉండవు. వారం రోజులు పాటు నిద్ర రాదు.. ఇతరులకు చెప్పకుండా నోరూరుకోదు. అచ్చం అలాంటి సందర్భమే ఓ అభిమానికి ఎదురైంది. అందుకే, తన కలను నిజం చేసిన కోహ్లీకి సదరు అభిమాని కృతజ్ఞతలు తెలిపాడు.
న్యూజిలాండ్‌తో రరెండో టెస్టు ప్రారంభానికి ముందు విరాట్.. ఓ యువ అభిమానికి బ్యాట్‌పై సంతకం చేసి అతను కలలను నిజం చేశాడు. అందుకు సదరు యువ అభిమాని విరాట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. తాను స్టార్ బ్యాటర్‌ను ఎంతగా ఆరాధిస్తానో వెల్లడించాడు. తన బ్యాట్‌పై కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు అభిమాని వీడియోలో పేర్కొన్నాడు.
నువ్ చాలా మంచోడివి కోహ్లీ..
"ఆటోగ్రాఫ్ ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుడను.. విరాట్ కోహ్లీ. నా కలలు నిజమయ్యాయి.. లవ్ యూ కోహ్లీ.." అని వీడియోలో యువ అభిమాని వెల్లడించాడు.
A lucky little fan got an autograph of Virat Kohli in his bat ?❤️
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 23, 2024
- Dream Come True Moment for a Little Fan. pic.twitter.com/kbz68r6KRH
తొలి రోజు ఇరు జట్లు సమం..
ఇక పూణే వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. తొలి రోజు ఆటలో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టు 72 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(76), రచిన్ రవీంద్ర(65) పరుగులు చేశారు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్(9 నాటౌట్), మిచెల్ సాంట్నర్(21 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ALSO READ | IND vs NZ, 2nd Test: రచీన్ రవీంద్ర, కాన్వే అర్ధ సెంచరీలు.. కివీస్‌కు సుందర్ షాక్