ఇదేమన్నా సినిమా హాల్ అనుకున్నారా ? కోర్టుకు వచ్చేటప్పుడు ఎలాంటి డ్రస్ వేసుకోవాలో తెలియదా ? అంటూ ఓ ఐఏఎస్ ఆఫీసర్‌పై పాట్నా హైకోర్టు జడ్జీ సీరియస్ అయ్యారు. కోర్టులో వైట్ షర్ట్ తో హాజరై.. కాలర్ ఓపెన్ చేసినందుకు జడ్జీ చురకలంటించారు. కరోనా కారణంగా.. వెబ్ కాస్టులో కోర్టు విచారణలు జరుపుతున్న సంగతి తెలిసిందే. కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. పాట్నా హైకోర్టు నుంచి అలాంటి క్లిప్ ఒకటి ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. బీహార్ లోని అర్బన్ డెవలప్ మెంట్ అండ్ హౌసింగ్ డిపార్ట్ మెంట్ ప్రిన్స్ పాల్ సెక్రటరీ ఆనంద్ కిషోర్ పాట్నా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన తెల్లటి చొక్కా ధరించి ఉన్నారు. ఇది చూసిన జడ్జీ సీరియస్ అయ్యారు.
కోర్టుకు వచ్చే ముందు ఎలాంటి డ్రస్ వేసుకోవాలో తెలియదా ? ముస్సోరిలోని ఐఏఎస్ ట్రైనింగ్ స్కూల్ కు వెళ్లలేదా ? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. బీహార్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులకు తెలియదా ? దీనికి అధికారి ఆనంద్ కిశోర్ ఏదో చెప్పబోయారు. ఫార్మల్ డ్రెస్ అంటే కనీసం కోటు.. షర్టు కాలర్ తెరవకూడదని చెప్పారు. వేసవి కాలమంటూ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించారు. ఈ వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండకాలం ఉన్నా.. దుస్తులపై జడ్జీ దృష్టి సారిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. న్యాయమూర్తితో అధికారి వాదించడంపై మరికొందరు విమర్శిస్తున్నారు.
जज साहब कुछ अधिक ही सख़्त हो रहे हैं। इतनी देर मुद्दों पर बात कर लेते तो कुछ काम की बात निकलती। pic.twitter.com/fI2y9He8Hj
— Narendra nath mishra (@iamnarendranath) June 11, 2022
