ఆధ్యాత్మికం: ఈ గుళ్ళల్లో  ప్రార్థించారా.. చదువులో టాప్​..!

పిల్లలు పుట్టారో లేదో.. వారిని ఏబడికి పంపాలి.. ఏం చదివించాలి.. ఆ పిల్లాడు ఎలా చదువుతాడు.. అనే ప్రశ్నలు నేటి తరం తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు.  అంతేకాదు.. ఫేమస్​ స్కూళ్లలో చదివిస్తే విద్యలో బాగా రాణిస్తారని ఓ నమ్మకం.. అందుకే ఎంత ఖర్చయినా సరే అలాంటి బళ్లకే పంపాలని ఇష్టపడతారు.. కాని పురాణాల ప్రకారం కొన్ని మురుగన్​ స్వామి ( శుభ్రమణ్యేశ్వ స్వామి, కుమారస్వామి) ఆలయాల్లో ప్రార్ధిస్తే చదువులో రాణిస్తారని పండితులు చెబుతున్నారు.
 
పార్వతి పరమేశ్వరులకు ఇద్దరు సంతానం.. ఒకరు వినాయకుడు కాగా.. మరొకరు శుభ్రమణ్యేశ్వరస్వామి.  ఈయననే మురుగన్​ స్వామి.. కుమారస్వామి అని కూడా పిలుస్తారు.  సూర పద్ముడు తాంత్రిక విద్యల్లో దిట్ట.  ఎంత ప్రయత్నించినా  సూర పద్ముడు ఏదో విధంగా తప్పించుకునేవాడు.  అప్పుడు రాక్షసంహారి విష్ణుమూర్తి ప్రత్యక్షమై.. ఓ ఆరు ప్రదేశాలను సూచించి.. అక్కడే ఉన్నట్టుగా తలంచుకుని పార్వతి పరమేశ్వరులను పూజించి.. తరువాత యుద్దం చేయమని చెబుతాడు.  అప్పుడు మురుగన్​ అలానే విష్ణుమూర్తి చెప్పిన  ప్రదేశాల్లో పూజలు జరుపుతుండగా.. రాక్షనుడికి ప్రత్యేకమైన వరాలున్నాయని.. అతనను సంహరించాలంటే ఓ ఆరు శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.  ఆ తరువాత ఆ ప్రాంతాల్లో నీవు ఉండి.. అక్కడకు వచ్చే భక్తులు నిన్ను ప్రార్థిస్తే.. వారు చదువులో రాణించి.. ఉన్నతస్థానాన్ని పొందుతారని చెబుతారు. 

 అలా తల్లిదండ్రుల ఆఙ్ఞ మేరకు .. ఇప్పటి తమిళనాడులోని ..  పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం, తిరుత్తణి, పళముదిరి కొలయ్‌.  ప్రాంతాల్లో యుద్ద శిబిరాలు ఏర్పాటు చేసుకొని.. దైవ శక్తితో ఆ ప్రాంతాల నుంచే యుద్దం చేశాడు.   ఇలా ఆరు ప్రాంతాలనుంచి ఏక కాలంలో యుద్దం చేయడంతో సూరపద్ముడినే రాక్షసుని మురుగన్​  సంహరించాడు. తరువాత తిరుత్తణి కొండపై స్వామి విశ్రాంతి తీసుకొని .. శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నాడు.  ఆ రోజున వేయి కిలోల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు.  

ALSO READ | Diwali 2024: దీపావళి ఐదు రోజుల పండుగ... ప్రాముఖ్యత.. ఆచారాలు ఇవే..

ఈ దేవాలయాల్లో .. ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం.అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు స్వామివారిని కొలుస్తూ ఇక్కడే తనువు చాలించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారు. ఆ ప్రసాదం తినగానే ముత్తుస్వామి నోరు పవిత్రమై ఆశుధారగా గానం చేశాడు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి అందజేశాడని పండితులు చెబుతున్నారు.