కార్తీకమాసం 2023 : శివానుగ్రహం పొందాలంటే కార్తీక సోమవారం తప్పకుండా ఇలా చేయాల్సిందే...

కార్తీకమాసం( Karthika Masam )లో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని ప్రజల నమ్ముతారు. శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తిక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయిని పండితులు చెబుతున్నారు.

హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేశారు.  కార్తీకమాసం( Karthika Masam )లో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని ప్రజల నమ్ముతారు. శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తిక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయిని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం అనగానే సాధారణంగా పరమ శివునికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకూ అత్యంత ప్రధానమైన మాసం. 

ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో  సోమవారానికి  ఉండే ప్రాధన్యత అంత ఇంతా కాదు.  ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. 

కార్తీక సోమవారం శివారాధన ఇలా.. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమని ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సోమవారం శివుని ఎలా ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయో చూద్దాం. కార్తీకమాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. 

అలాగే సోమవారం చేసే స్నానం, పూజా, జపం ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం పొందుతారని నమ్ముతారు.అయితే కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది.శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం( Koti Somavaram ) రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అని పండితులు చెబుతున్నారు. శివాలయ సందర్శనం( Lord Shiva Tempple ), అభిషేకం, ఉపవాసం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. 

నవంబర్​ 20న చేసే  దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.ఈ నెల రోజులు పూజ చేసిన ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు.కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.అందుకే రేపు ( నవంబర్​ 20)  కార్తీక సోమవారం కాబట్టి ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం సొంతం చేసుకుంటారు.కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయనికి వెళ్లి పరమేశ్వరున్ని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని( om Namah Shivayya ) పఠించాలి.ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి.ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది.